ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గోపి థియేటర్లో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్ర బృందం సందడి చేసింది. సినిమా విజయోత్సవ సంబరంలో భాగంగా డైరెక్టర్ ప్రదీప్, హీరో ప్రదీప్లు పాల్గొన్నారు. చిత్రం విజయంపై హీరో ప్రదీప్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాకు సంగీతం అందించిన అనూప్ రూబెన్స్కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి చిత్రాలు మరెన్నో తీస్తానని ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
ఇవీ చూడండి...: పల్లెపోరు: ఆ గ్రామాల్లో ఎన్నికల్లేవ్.. ఎందుకంటే ?