ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో జరిగిన అగ్నిప్రమాదంలో 20 గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ గేదె సజీవదహనం కాగా.. అక్కడే ఉన్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఈపురుపాలెం ఎస్సై సుబ్బారావు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ మహిళను తన వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అంతలో అక్కడకి వచ్చిన బాపట్ల అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు.
![మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:00:51:1621935051_ap-ong-42-25-boyenavaripalem-gaddi-vamulu-dahanam-av-ap10068_25052021145302_2505f_1621934582_711.png)
అగ్నిప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. మహిళను రక్షించడంలో ఎస్సై వ్యవహరించిన తీరుకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి..