ETV Bharat / state

28 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రి.. ఎక్కడో తెలుసా..!

సాధారణంగా భవనాలు కట్టాలంటే కనీసం నెల సమయం పడుతుంది. అలాంటిది 28 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రిని నిర్మించే లక్ష్యంతో ప్రకాశం జిల్లాలో ఇండో అమెరికన్‌ సొసైటీ ఆధ్వర్యంలో పనులు మొదలు పెట్టారు. అంతే కాకుండా అవసరం లేనప్పుడు భాగాలు విడగొట్టి వేరే ప్రాంతానికి తరలించవచ్చు.

hospital
hospital
author img

By

Published : Sep 9, 2021, 6:52 AM IST

సాధారణంగా భవనాలు కట్టాలంటే పునాదులు తీసి.. పిల్లర్లు వేసేందుకు కనీసం నెల సమయం పడుతుంది.. అలాంటిది 28 రోజుల్లోనే ఆసుపత్రి నిర్మించేస్తున్నారు. ఒంగోలు నగరంలోని సర్వజన ఆసుపత్రి వెనుక ఇండో అమెరికన్‌ సొసైటీ ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రిని కేవలం 28 రోజుల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఇప్పటికే 15 రోజుల పనులు కాగా ఆసుపత్రి ఓ రూపుకొచ్చింది. మద్రాస్‌ ఐఐటీ సాంకేతిక సహకారంతో రూ.3.5 కోట్లతో ప్రి ఫ్యాబ్రికేటెడ్‌
విధానంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
10 ఐసీయూ పడకలు, 90 పడకల జనరల్‌ వార్డు ఉండేలా చూస్తున్నారు. పది నుంచి పదిహేనేళ్లు వినియోగించుకోవచ్చు. అవసరం లేనప్పుడు భాగాలు విడగొట్టి వేరే ప్రాంతానికి తరలించవచ్చు. కొవిడ్‌ మూడో దశను ఎదుర్కోవడానికి ఇది ఉపకరించనుంది. రాష్ట్రంలో ఈ తరహా ఆసుపత్రిని నిర్మించడం ఇదే మొదటిసారని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు తెలిపారు. అదే ఈ స్థాయిలో ఆసుపత్రిని సాధారణ పద్ధతిలో నిర్మిస్తే 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది.

ఇదీ చదవండి

SP Malika Garg: చంద్రబాబు లేఖ దిగ్బ్రాంతికి గురి చేసింది : ప్రకాశం ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.