ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నిరుపేద కుటుంబాలపై లక్షలకు లక్షలు ఇంటి పన్ను వసూలు చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒంగోలుకి చెందిన రాజేష్ అనే వ్యక్తి ఉంటున్న రేకుల షెడ్డుకు 2018-2021 వరకు ఇంటి పన్ను లక్షా 50వేలు రావడంతో కంగుతిన్నాడు. అతను జీఆర్పీ పిటిషన్ ఫైల్ చేయడంతో.. లక్ష తగ్గించారని సుమారు 50వేలు కట్టమంటున్నారని వాపోతున్నారు.
![Property tax](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12280621_p.jpg)
రేకుల షెడ్డుకు అంత పన్ను రావడమేంటని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. వెంటనే రీవైజ్ చేసి తమకు న్యాయం చేయాలని రాజేష్ కోరుతున్నారు.