నెల్లూరు జిల్లా విడవలూరు మండల తెదేపా నేత భానురెడ్డిని వైకాపాలోకి చేర్చుకోవద్దంటూ వైకాపా నాయకుడు నాగేంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బానురెడ్డిని చేర్చుకుంటే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యలు చేసుకుంటామంటూ ఇద్దరు కార్యకర్తలు... కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని హెచ్చరించారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న తమను కాదని తెదేపా వారిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. పార్టీ బలోపేతానికి ఎవరిని చేర్చుకున్నా, పార్టీ కోసం పనిచేసిన వారికే గుర్తింపు, గౌరవం ఉంటుందని ఎమ్మెల్యే హామీతో వైకాపా కార్యకర్తలు ఆందోళన విరమించి వెనుదిరిగారు.
ఇవీ చూడండి...