నెల్లూరు జిల్లా గూడూరు మండలం మంగళపురు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఆరుగురు యువకుల్లో ఒకరు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన లోకేష్ తన స్నేహితులతో కలిసి పాడుపడిన క్వారీ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ అతను గల్లంతయ్యాడు. అతని స్నేహితులు వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇవీ చదవండి..