ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రంలోని పలు నియోజవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా జగన్ ప్రజలకిచ్చిన హామీలను దాదాపు పూర్తి చేశారని వ్యాఖ్యానించారు.
ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి..
నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాదయాత్ర చేశారు. యాత్రలో వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టారని సంజీవయ్య వ్యాఖ్యానించారు.
ఏడాదిన్నరలోపే పూర్తి చేశారు..
సీఎం జగన్ పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలన్నీ ఏడాదిన్నర లోపే పూర్తి చేశారని వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆయన పాదయాత్ర నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. పట్టణంలోని హనుమన్ కూడలిలో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఇదీచదవండి