ETV Bharat / state

పెయింగ్‌ గెస్ట్‌ ముసుగులో ప్ర"వృత్తి"…గాలిస్తున్న పోలీసులు

విలాసవంతమైన జీవనం కోసం ఓ మహిళ దొంగగా మారింది. హాస్టళ్లను టార్గెట్​ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతోంది. ఓ ఉద్యోగిని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కి'లేడి' కోసం గాలిస్తున్నారు.

పెయింగ్‌ గెస్ట్‌ ముసుగులో ప్ర"వృత్తి"
author img

By

Published : Sep 13, 2019, 11:41 AM IST

Updated : Sep 13, 2019, 12:12 PM IST

మహిళల హాస్టళ్లలో పెయింగ్‌ గెస్ట్‌గా ఉంటూ బంగారు ఆభరణాలను దోచుకునే కిలాడీ లేడీ కోసం నెల్లూరు పోలీసులు గాలిస్తున్నారు. విలాసవంతమైన జీవనం కోసం దొంగగా మారిన ఓ మహిళ చోరీలనే వృత్తిగా మార్చుకుంది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె మళ్లీ చేతివాటం ప్రదర్శించింది. బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ హాస్టల్‌లో బ్యాంకు ఉద్యోగినికి సంబంధించిన ఫోను, ఏటీఎం, నగదుతో ఉడాయించింది. ఏటీఎం ద్వారా రూ.20వేల నగదు దోపిడీ చేసింది. ప్రస్తుతం నెల్లూరు పోలీసులు ఆ మహిళ కోసం ఆరా తీస్తున్నారు.

వింజమూరుకు చెందిన ఈ మహిళ భర్త నుంచి దూరంగా ఉంటోంది. 2013లో వింజమూరు పోలీసులు ఓ దొంగతనం కేసులో ఆమెను అరెస్టు చేసి సస్పెక్ట్‌ షీటు తెరిచారు. పోలీసుల నిఘా అధికమవడంతో నెల్లూరుకు మకాం మార్చింది. వివిధ కంపెనీల్లో పనిచేస్తూ రాత్రివేళల్లో లేడీస్‌ హాస్టళ్లలో ఉండేది. తోటి మహిళలు ఆదమరిచి ఉండటాన్ని గమనించి వారి బంగారు నగలు, సెల్‌ఫోన్లను దొంగలించి ఉడాయించేది. ఇదే క్రమంలో ఈ ఏడాది జులై 21న వీఆర్సీ సెంటరులోని ఓ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ తోటి మహిళ నిద్రిస్తుండగా ఆమెకు చెందిన బంగారు సరుడు, సెల్‌ఫోన్‌ను అపహరించుకెళ్లింది. దీంతో ఘటనపై బాధితురాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి చిన్నబజారు ఇన్‌స్పెక్టరు శ్రీనివాసన్‌ తన సిబ్బందితో ఆమె కదలికలపై నిఘా ఉంచారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

బెయిల్‌పై బయటకు వచ్చిన మహిళ.. నగరంలోని హరనాథపురంలో గల ఓ హాస్టల్‌లో చేరేందుకు వచ్చింది. అదే హాస్టల్‌లో బ్యాంకు ఉద్యోగిని సంవత్సరం నుంచి ఉంటున్నారు. ఆ గదినే షేర్‌ చేసుకునేందుకు వచ్చారు. స్నానం కోసం వెళ్లిన బ్యాంకు ఉద్యోగిని.. వెంటనే ఆమెకు చెందిన సెల్‌ఫోను, ఏటీఎం, రూ.4వేల నగదుతో ఉడాయించింది. ఏటీఎం ద్వారా వేరే వ్యక్తులకు ఫోన్‌ పే ద్వారా నగదు చెల్లించి, కొంత నగదు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసింది. ఇలా ఏటీఎం ద్వారా రూ.20వేల నగదును దోచుకుంది. తన ఫోన్‌, ఏటీఎం దొంగలించారని గుర్తించిన సదరు ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలాజీనగర్‌ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే, హాస్టల్‌లో వచ్చిన మహిళ ఎవరనేది ఆధారాలు లభించలేదు. ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండానే సంబంధిత హాస్టల్‌ నిర్వాహకులు ఆమెకు గది కేటాయించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమె.. ఆమెనే
హరనాథపురంలోని హాస్టల్‌లో ఫోను,
ఏటీఎంతో ఉడాయించిన మహిళ ఎవరనేది పోలీసులకు అంతుచిక్కకుండా పోయింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే గది కేటాయించడం, హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. దొంగలించిన ఫోను కూడా ఆఫ్‌ చేయడంతో పోలీసులకు వేరే మార్గం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఒకటిన్నర నెల క్రితం చిన్నబజారు పోలీసులు అరెస్టు చేసిన మహిళ చిత్రాన్ని బాధితులు సేకరించారు. హాస్టల్‌లో దొంగతనం చేసింది తననేనని గుర్తించారు. దీంతో సంబంధిత చిత్రాన్ని పోలీసులకు పంపించారు. ప్రస్తుతం నెల్లూరు పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

Intro:తమ్మినేని దంపతులకు పౌరసన్మానం

Body:etv

Conclusion:etv
Last Updated : Sep 13, 2019, 12:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.