ETV Bharat / state

'మద్యం దుకాణం తెరిచి ఉంటే... మాకూ కరోనా వచ్చేలా ఉంది'

కరోనా విస్తరిస్తున్నా.. ఏమాత్రం భయ లేకుండా... భౌతిక దూరం పాటించకుండా మద్యం దుకాణం ముందు మందు బాబులు బారులు తీరుతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా తీరు మారటం లేదని మద్యం షాపును మూసివేయించారు.

wine shop closed by villagers
మద్యం దుకాణాన్ని మూసివేసిన స్థానికులు
author img

By

Published : Jul 24, 2020, 8:06 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామిక వాడలోని ప్రభుత్వ మద్యం దుకాణం ఎదుట స్థానికులు ధర్నాకు దిగారు. మద్యం దుకాణం వద్దకు భారీగా మద్యం బాబులు చేరుకుని గందరగోళం చేస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా ఉన్న కంపెనీలో పని చేస్తున్న 40 మందికి కరోనా సోకిందనీ.. ఇలా మందుబాబులు భౌతిక దూరం పాటించకుండా ఉండటం వలన మరింతగా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం తెరిచి ఉంటే కరోనా మరింత విజృంభించి.. కరోనా బారిన పడతామని గ్రామస్థులు వాపోయారు.

ఇదీ చదవండి: 'ఆక్రమణదారులను వదిలేసి మా గుడిసెలు తొలగించడం దారుణం '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.