సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జలాశయాలు నీటితో నిండుకుండను తలపిస్తున్నాయని... రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సాగునీటి సలహామండలి సమావేశంలో... మంత్రి అనిల్‌తో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. రబీ సీజన్లో 8లక్షల 10వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.
సోమశిల జలాశయం కింద పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో 5లక్షల ఎకరాలకు, కండలేరు జలాశయం కింద 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సాగునీరు వదిలేశామని, రేపటి నుంచి అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తామని మంత్రి అనిల్ తెలిపారు. కాలువల కూడా ముందుగానే రూ.4 కోట్ల 50 లక్షలతో పూడికలు తీయిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: