నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి వద్ద సోమశిల జలాశయం నుంచి స్వర్ణముఖి నదిలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ రిజర్వాయరు నుంచి నీటిని వదలడంతో ఇసుక అక్రమ తరలింపుదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఇసుక తవ్వకాలు చేసే ప్రాంతానికి నీటిని రాకుండా అడ్డుకొంటున్నారని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. స్వర్ణముఖి నది పరిధిలోని చెరువులు నింపాల్సి ఉందని అన్నదాతలు వాపోతున్నారు.
ఇదీ చదవండీ.. AP Fiber net case: సీఐడీ ఎదుట హాజరైన ముగ్గురు నిందితులు..