VIRASAM Maha Sabhalu: నెల్లూరు జిల్లాలో రెండు తెలుగు రాష్ట్రాల విప్లవ రచయితల సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులు నిర్వహించే 28వ విరసం మహా సభలకు వివిధ రాష్ట్రాల నుంచి రచయితలు తరలివచ్చారు. తొలుత నెల్లూరు నగరంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కోవూరులోని సుందరయ్య భవన్లో మహా సభలు ప్రారంభించారు. విరసం ఏర్పడి 52 ఏళ్లు గడిచిందని నిర్వహకులు తెలిపారు. ఈ సభలో 20 పుస్తకాలను ఆవిష్కరిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన పలువురు వక్తలు.. మోదీ ఆధిపత్య నిర్ణయాలను ఖండించారు. మరోవైపు సభ వద్ద ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌తో పాటు స్థానిక పోలీసులు పెద్ద సంఖ్యలో నిఘా ఉంచారు.
ఇదీ చదవండి
Family suicide at vijayawada : విజయవాడలో.. తెలంగాణ కుటుంబం ఆత్మహత్య!