ETV Bharat / state

పాత లెక్కలు.. కొత్త చిక్కులు

నెల్లూరు జిల్లాలో విద్యా కానుకను పూర్తి స్థాయిలో అందించాలంటే పెద్ద సంఖ్యలో రాత పుస్తకాలు రావాల్సి ఉంది. వేల సంఖ్యలో సాక్స్‌ల కొరత ఉంది. వచ్చిన బూట్లను ఆయా కేంద్రాలకు చేరవేసినా.. కొలతల్లో తేడాలు ఉన్నట్లు మండల విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి అందరికీ కిట్లు అందుతాయా? లేదా? అన్న సందేహం నెలకొంది. ’

author img

By

Published : Oct 4, 2020, 1:42 PM IST

జిల్లాకు చేరిన విద్యా కానుక వస్తువులను చూపుతున్న అధికారులు

నెల్లూరు జిల్లాలో కరోనా నేపథ్యంలో ఆదాయ వనరులు కోల్పోయిన.. తగ్గిన ప్రజలు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇంకోవైపు విద్యా కానుక కిట్లకు ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాక, గత ఏడాది సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదించారు. దీంతో అందరికీ తొలి విడతలో అందే పరిస్థితి లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. జిల్లాలో తొలి విడత పంపిణీకి 17,26,280 పాఠ్యపుస్తకాలు చేరాయి. ఇవి పూర్తిస్థాయిలో చేరినా రాత పుస్తకాల కొరత ఉంది. 14,10,386 రాత పుస్తకాలు రావాల్సి ఉండగా- ఇప్పటికి 12,27,600 మాత్రమే వచ్చాయి. తొలుత సెప్టెంబరులో పంపిణీ చేస్తారని చెప్పారు. దాంతో ఆగస్టులో కొన్ని వస్తువులను పాఠశాలలకు పంపారు. కార్యక్రమం వాయిదా పడటంతో పంపిణీ నిలిచిపోయింది. ఆ తర్వాత తేదీ ప్రకటించడంతో ఆగమేఘాలపై వస్తువులు పాఠశాలలకు చేరవేసినా.. మరికొన్ని రావాల్సి ఉంది. మళ్లీ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది.

సరిపడా అందేనా...

నెల్లూరు నగరంలోని కురగంటి రామకృష్ణ మున్సిపల్‌ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు గత ఏడాది 1680 మంది విద్యను అభ్యసించారు. వారికి అదనంగా ఇప్పటికే 250 మంది కొత్తగా వివిధ తరగతుల్లో చేరారు. మరో 600 మంది పెరగవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో ఉన్న సంఖ్య ఆధారంగా కానుక వస్తువులను పంపిణీ చేయనుండటంతో అదనంగా చేరిన వారికి ఎప్పటికి అందుతాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. విద్యా కానుక ప్రారంభం నాటికి ఆయా పాఠశాలల్లో ఎంత మంది ఉన్నారో.. అంత మందికీ అందిస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. తల్లిదండ్రులు అదే కాంక్షిస్తున్నారు. విద్యార్థులకు అందిస్తున్న సమ దుస్తుల కుట్టు కూలి సైతం సరిపోదని, దాన్ని పెంచి అందించాలని కోరుతున్నారు. ఒక జతకు రూ. 40 అందిస్తున్నారని, ఆ మొత్తం ఎక్కడ సరిపోతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగనన్న విద్యా కానుక ఇప్పటికే విద్యార్థుల చేతికి చేరాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ వస్తోంది. సోమవారం వాటిని పంపిణీ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా.. కరోనా దృష్ట్యా నవంబరు 2 నుంచి బడులు తెరవాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దాంతో కానుక కార్యక్రమం సైతం మరోసారి వాయిదా పడింది. కొన్ని సమస్యలు అధికారులను వెన్నాడుతుండగా- వాయిదా నిర్ణయంతో జిల్లా విద్యాశాఖలో హడావుడి తగ్గింది.

కొరతను సమకూర్చుకుంటాం : పి.రమేష్‌, డీఈవో

జగనన్న విద్యా కానుక వాయిదా పడింది. తదుపరి తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే కానుకలోని వస్తువులు చాలా వరకు జిల్లాకు చేరాయి. కొద్దిగా కొరత ఉన్న వస్తువులను ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో సమకూర్చుకుంటాం.

కిట్‌లోని వస్తువులు

కిట్‌లోని వస్తువులు
కిట్‌లోని వస్తువులు

ఇదీ చదవండి

' ప్రశ్నించే పాత్రికేయులు ఉండకూడదని దాడులు చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.