తన ఇంటిపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారని వెంకటాచలం ఎంపీడీవో సరళ ఆరోపించారు. వెంకటాచలం మండల పరిధిలోని అనికేపల్లిలో ఎమ్మెల్యే అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి సంబంధించిన లే-ఔట్‌కు... పంచాయతీ వాటర్ కనెక్షన్ ఇవ్వాలని శ్రీధర్‌రెడ్డి తనను అడిగారని సరళ చెబుతున్నారు. ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినా... 3 రోజుల క్రితం ఫోన్‌లో బెదిరించారని అన్నారు. నిన్న రాత్రి మద్యం సేవించి..తాను లేని సమయంలో ఇంటిపైకి వచ్చారని ఆరోపించారు. తన ఇంటి ఎదుట చెత్తకుండీ పెట్టి... కరెంట్ కట్ చేయించారని వాపోయారు. కుళాయి కనెక్షన్ కూడా తొలగించేందుకు గుంతను సైతం తీశారని తెలిపారు. తన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురై తనకు చరవాణిలో సమాచారమిచ్చారని పేర్కొన్నారు.
అందుబాటులో లేని అధికారులు
జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీవో నెల్లూరు పోలీస్ స్టేషన్‌కు అర్ధరాత్రి వెళ్లగా అక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. ఉదయం 4.30 గంటల వరకూ స్టేషన్ ఆవరణలోనే బైఠాయించారు. దాదాపు ఐదు గంటలు వేచి చూసిన అనంతరం అక్కడికి వచ్చిన ఎస్సై సాంబశివరావుకు తన ఫిర్యాదును అందజేశారు. ఒక గ్రూప్-1 స్థాయి అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల గతేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి: