నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్‌లో అఖిల భారత రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం జరిగింది. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొన్నారు. డిజిటల్ మీటర్లు బిగించడం వలన రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడతారని ఆయన తెలిపారు. ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే మంచి పనులు చేస్తారు అనుకున్నారు కానీ .. ఇలా రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన 3 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ రైతులకు ఎంతో మేలు చేశారని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం రైతులను ఇబ్బంది పెట్టేపని చేస్తున్నారన్నారు. వెంటనే జీవో నెంబర్ 22 రద్దు చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: