నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ఎస్టీ కాలనీలో తాగునీటి సమస్యపై మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కాలనీలో 20 రోజులుగా తాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే తమ బాధలను ఆలకించేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు సమస్యలు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. కాలనీలో మూడు చేతిపంపులు ఉండగా... అందులో ఒకటి మాత్రమే పని చేస్తోందని.. అందులో కూడా 3 బిందెల కంటే ఎక్కువ నీరు రాకపోవడం వల్ల అవస్థలు పడుతున్నామని అన్నారు. కరోనా ప్రభావంతో ఎక్కడికైనా వెళ్లి నీరు తెచ్చుకోవాలన్నా భయంగా ఉందని.. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి..