ETV Bharat / state

Anandayya Medicine: ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ.. జులై 1కి వాయిదా - ఆనందయ్య మందు

ఆనందయ్య ఔషధ పంపిణీపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. చుక్కల మందును 5 ల్యాబుల్లో పరీక్షించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వీటిలో కంటికి హానిచేసే పదార్థముందని ల్యాబ్‌లు నివేదించినట్లు తెలిపారు. ల్యాబ్‌ల నివేదికలను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది.

high court on anandiya drops medicine
high court on anandiya drops medicine
author img

By

Published : Jun 21, 2021, 1:44 PM IST

Updated : Jun 22, 2021, 3:12 AM IST

ఆనందయ్య ఔషధ పంపిణీపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆనందయ్య కంటి చుక్కల మందు విషయంలో పరీక్ష ఫలితాల నివేదికను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జులై 1కి వాయిదా వేసింది.

ఆనందయ్య ఔషధ పంపిణీపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. చుక్కల మందును 5 ల్యాబ్‌ల్లో పరీక్షించినట్లు ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. చుక్కల మందులో కంటికి హానిచేసే పదార్థాలు ఉన్నట్లు కొన్ని సంస్థల పరీక్షలో వెల్లడైందన్నారు. ఆ మందువల్ల కంటి చూపుకు ప్రమాదం ఉందన్నారు. నివేదికలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. చుక్కల మందుతో ఎలాంటి దుష్ప్రభావం లేదని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల పేర్కొందని ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ తెలిపారు. చుక్కల మందు కొవిడ్ బాధితుల ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆ మేరకు కోర్టుకు హామీ ఇస్తూ అఫిడవిట్ వేయడానికి సిద్ధమన్నారు.

ఇదీ చదవండి: విజయనగరం కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

Last Updated : Jun 22, 2021, 3:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.