నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి పొగాకు కేంద్రంలో మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సరైన గిట్టుబాటు ధర లభించడంలేదని ఇటీవల అక్కడ రైతులు నిరసన చేశారు. ఈ సమస్యను రైతు సంఘం నాయకులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించి మార్క్ ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరతో పంట కొనాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నేడు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తమ సమస్య పట్ల స్పందించి వెంటనే నిర్ణయం తీసుకున్న సీఎంకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి...