ETV Bharat / state

Road Accident In Nellore District : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి - ap news

accident
accident
author img

By

Published : Dec 25, 2021, 11:23 PM IST

Updated : Dec 26, 2021, 5:27 AM IST

23:19 December 25

రాపూరు మండలం బండేపల్లి వద్ద ఘటన

Road Accident In Nellore District : నెల్లూరు జిల్లా రాపూరు మండలం బండేపల్లి వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. ముగ్గురు యవకులు మృతి చెందారు. వీరంతా డక్కిలి మండలానికి చెందిన వేర్వేరు గ్రామానికి చెందినవారు. ప్రమాద స్థలంలో ఓ ద్విచక్ర వాహనంపై వెళుతుండిన లింగసముద్రం నివాసి గోనుగొడుగు ఉదయ్‌ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ద్విచక్ర వాహనంలో వెళుతుండిన ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. వారిలో సంగనపల్లికి చెందిన పరుచూరి సునీల్‌ (26) రాపూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకునేసరికి మృతిచెందారు. వెలికల్లుకు చెందిన శ్రీనివాసులు (28)ను మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

బంధువుల రోదనలు

సంగనపల్లికి చెందిన చంద్రమౌళి కుమారుడు సునీల్‌కు రెండేళ్ల కిందటే వివాహం అయింది. ఆయనకు ఏడాది కుమారుడు ఉన్నారు. సునీల్‌కు సమీప బంధువు అయిన వెలికల్లుకు చెందిన శ్రీనివాసులుతో కలిసి రాపూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లింగసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన సంజీవయ్య రమణమ్మ దంపతులకు ఒక కుమారుడు ఉదయ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉదయ్‌ పొక్లయినర్‌ ఆపరేటర్‌గా, వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. ప్రమాదంలో ఏకైక కుమారుడు మృత్యువాతపడడంతో ఈ కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది. స్థానికులు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన ఆ గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇదీ చదవండి Adilabad Accident Today: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురు దుర్మరణం

Last Updated : Dec 26, 2021, 5:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.