నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. కుమ్మరి ఇంటిలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి .... మెట్టినిల్లు అయిన చాకలి మండపానికి తీసుకువచ్చారు. అనంతరం సంప్రదాయంగా అమ్మవారికి 2 కళ్ళు అమర్చి పూల అలంకరణలతో సిద్ధంచేసిన సప్పరం మీద పోలేరమ్మను భక్తుల సందర్శనార్ధం నిలిపారు. ఈ సాయంత్రం భక్తజన కోటి మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. ఈ జాతరం కోసం 4 లక్షల మంది రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దేవదాయశాఖ మంత్రి , ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీచూడండి.వైభవంగా పోలేరమ్మ జాతర