నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని పలు దేవాలయాల్లో దొంగతనం చేసే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కావలికి చెందిన నడింపల్లి గోపి కొమ్మలపాటి, గోవర్ధన్ ఇద్దరు హుండీల చోరీకి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఓ గుడిలో చోరీకి యత్నించి విఫలమవగా.. పక్కనే ఇంట్లో బంగారు గొలుసు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో ఇద్దరినీ పట్టుకున్న పోలీసులు.. వారికి పదేళ్ల నేర చరిత్ర ఉందని గుర్తించారు. కేసు నమోదు చేశారు.
ఇదీచూడండి