వలస కూలీల కోసం నెల్లూరులో ఏర్పాటు చేసిన ఓ పునరావాస కేంద్రంలో పరిస్థితులు కరోనా వ్యాప్తి భయాలను రేకెత్తిస్తున్నాయి. నగరంలోని కలెక్టర్ బంగ్లాకు సమీపంలో ఉన్న బారాషాహీద్ దర్గా పునరావాస కేంద్రంలో భౌతిక దూరం పాటించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిశుభ్రత గురించి కూడా పట్టించుకోవడం లేదని అందులో ఉంటున్న వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముగ్గురికి ఆరోగ్యం దెబ్బతినగా మరోచోటికి తరలించారు. ఆహారం కూడా అందరికీ ఇవ్వడం లేదని చెబుతున్నారు. అర్థరాత్రి అభాగ్యులు పడుతున్న అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
ఇవీ చదవండి...కొవిడ్ చికిత్సలో వైద్యులకు తోడ్పాటుగా... నెల్లూరు రోబో