నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మనాయుడుపేటలో జ్వరం ఇంజక్షన్ వికటించి వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. వెంకటసుబ్బయ్య జ్వరంగా ఉందని స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు చికిత్స కోసం వెళ్లగా సదరు వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికిటించి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. ఆర్ఎంపి వైద్యుడు వాడిన మందులను సీజ్ చేశారు. అర్హత లేకుండా గ్రామాల్లో వైద్యం అందించే ఆర్ఎంపీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: