నెల్లూరు జిల్లా కొత్తూరులో "దారుణం.. 13 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి" ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక గిరిజన కాలనీకి చెందిన మానికల చిన సుబ్బయ్య అనే 45 ఏళ్ల వ్యక్తికి వివాహం అయి.. నలుగురు పిల్లలు ఉన్నారు. పదేళ్ల కిందట భార్య వదిలి వెళ్లిపోవటంతో.. అక్క వద్ద ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో తన సోదరి కూమార్తె అయిన 13ఏళ్లు మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు.
అనంతరం అక్కడి నుంచి దంపూరు వెళ్లి ఉంటున్నాడు. అయితే బాలికను శారీరకంగా కలవాలంటూ ఒత్తడి చేయగా.. ఆమె భయపడి అరపులు పెట్టింది. దీంతో చుట్టుపక్కల వారు స్పందించి ఆమెను కాపాడారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండీ.. దారుణం.. 13 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి