నెల్లూరు జిల్లా గూడూరులోని సనత్ నగర్.... కారు పేలుడుతో భీతిల్లింది. సురేశ్ కుమార్ అనే వ్యక్తి తన స్కార్పియో వాహనాన్ని ఇంటి ఎదుట నిలిపి ఉంచారు. అంతా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా శబ్ధం వినిపించింది. బయటకు వెళ్లి చూసే సరికి కారులో మంటలు వ్యాపించాయి.
పేలుడు ధాటికి పక్కనే ఉన్న పది ఇళ్ల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. కారులో ఉండే ఏసీ గ్యాస్ సిలిండర్ పేలిందని భావిస్తున్నారు. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: