Devineni Uma fire on CM Jagan and sajjala: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, ప్రభుత్వ సలహాదారు సజ్ఞల రామకృష్ణా రెడ్డిపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆజ్ఞతోనే ఆనం వెంకటరమణారెడ్డిపై సజ్జల రామకృష్ణారెడ్డి దాడి చేయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అవినీతిని, అతని అసమర్ధతను ప్రశ్నిస్తున్నందుకే ఆనంపై దుండగులతో దాడి చేయించారు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన (ఆనం) పై దాడి జరిగి 24 గంటలు గడస్తున్నా.. ఇప్పటివరకూ పోలీసులు స్పందించకపోవడాన్ని దేవినేని ఉమా తీవ్రంగా తప్పుపట్టారు.
ఆనంపై 10మంది దుండగులు దాడికి యత్నం.. తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై ఆదివారం (04-6-2023) రోజున 10 మంది దుండగులు దాడికి యత్నించారు. నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. నెల్లూరులోని తన కార్యాలయం నుంచి ఆయన బయటికి వస్తుండగా సుమారు 10 మంది యువకులు బైక్‌లపై వచ్చి, కర్రలతో దాడికి యత్నించారు. అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకుని, ప్రతిఘటించడంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు.
నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం
జగన్ అవినీతి, అసమర్ధతను ప్రశ్నించినందుకే.. ఆనంపై జరిగిన దాడిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా నెల్లూరులోని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉమా మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆజ్ఞతోనే ఆనం వెంకటరమణారెడ్డిపై సజ్జల రామకృష్ణారెడ్డి దాడి చేయించారని వ్యాఖ్యానించారు. జగన్ అవినీతి, అసమర్ధతని ప్రశ్నిస్తున్నందుకే దాడి చేయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఫ్యాక్షనిజం పిచ్చి పరాకాష్ఠకి చేరిందని మండిపడ్డారు. అందుకే ఆనంపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ పోలీసులు తగిన విధంగా స్పందించలేదన్నారు.
జగన్ ఆజ్ఞలేనిదే చీమకూడ కుట్టదు.. ''ఆనం వెంకటరమణారెడ్డిపై జరిగిన దాడి విషయంలో మంత్రి కాకాణి, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి. సుపారీ ఎవరిచ్చారు..?, గంజాయి బ్యాచ్‌ని ఎవరు పంపించారో..? పోలీసులు నిగ్గు తేల్చాలి ఉంది. పోలీసుల వైఫల్యమే దాడులకు కారణమౌతోంది. డీజీపీ, డీఐజీ, ఎస్పీలు తగిన విధంగా స్పందించి, దాడులను అరికట్టాలి. రూ.2000 నోటుతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతి సొమ్మంతా ఇసుక, లిక్కర్ పేరుతో బ్యాంకుల్లో జమ అవుతోంది. నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతమైనది. అటువంటి జిల్లాల్లో అశాంతిని వైసీపీ నేతలు ప్రారంభించారు. ఈరోజు మేమంతా చాలా గర్వపడుతున్నాం. జగన్ ఆజ్ఞలేనిదే.. సజ్ఞల రామకృష్ణారెడ్డి వంటి చీమ కుడుతుందా..?.'' అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు.
TDP Leader Anam on Jagan: వామ్మో.. సీఎం జగన్ తాగే నీరు, ధరించే చెప్పులు ఇంత ఖరీదా..?
వైసీపీ దాడులకు భయపడం.. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త సంస్కృతిని ప్రారంభించారని..టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. బ్లెడు బ్యాచ్‌లను పలిపించి.. వారికి మందు, గంజాయిని తాగించి టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ దాడులకు తాము భయపడబోమని ఆయన తేల్పిచెప్పారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసులు ఘోరంగా వైఫల్యమైతే, తామే వాటిని ప్రతిఘటిస్తామన్నారు.
ఎఫ్ఐఆర్ కాపీ చించివేత.. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై హత్యాయత్నం జరిగితే.. పోలీసులు బెయిల్ వచ్చే కేసులు పెట్టడంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. ఎఫ్ఐఆర్ కాపీని మాజీ మంత్రి దేవినేని ఉమా చించేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డిని కలిసిన టీడీపీ నాయకులు.. జరిగిన దాడి ఘటనను వివరించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని.. ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. మారణాయుధాలతో దాడికి ప్రయత్నిస్తే.. పోలీసులు మాములు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు.
Nara Lokesh meet with Balijas: బలిజలపై జగన్ వేధింపులు.. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం..: నారా లోకేశ్