అసమర్థ పాలనతో ముఖ్యమంత్రి జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని నెల్లూరు తెదేపా నేతలు విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమం 300 రోజులు చేరిన సందర్భంగా నెల్లూరులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని వ్యతిరేకించని జగన్.., ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానులనటం సరికాదని నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు హితవు పలికారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ..,అమరావతినే రాజధానిగా కొనసాగించే వరకు తెదేపా పోరాడుతుందని వ్యాఖ్యనించారు.
పంథాలతో మూడు రాజధానుల ప్రకటన
అమరావతి రైతులకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు దృష్ట్యా అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే...పంథాలతో వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చిందని రామకృష్ణ మండిపడ్డారు.
అమరావతి రైతులను మోసం చేశారు
ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరావతి రైతులను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అమరావతి రైతులకు సంఘీభావంగా స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
ఇదీచదవండి