ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది' - నెల్లూరులో తెదేపా నేతలు నిరసన

అచ్చెన్నాయుడు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ నెల్లూరు పట్టణంలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. తక్షణం అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్​ చేశారు. వైకాపా ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

tdp protest against government and demands accham naidu release at nellore city
అచ్చెన్నాయుడు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు ఆందోళన
author img

By

Published : Jun 26, 2020, 4:22 PM IST

అచ్చెన్నాయుడి అరెస్ట్​ను నిరసిస్తూ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్​ వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించడమే కాకుండా, కరోనా వైరస్​ను వైకాపా రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని నూడా మాజీ చైర్మన్​ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఆసుపత్రిలోనే అచ్చెన్నాయుడిని విచారించాలన్న కోర్టు సూచనలను అధికారులు పక్కనపెట్టడం దారుణమన్నారు. కక్షపూరిత రాజకీయాలను విడనాడి, అచ్చెన్నాయుడిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులకు నారా లోకేశ్ భరోసా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.