తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో.. అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని తెదేపా నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నించిన అధికార పార్టీ.. రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిందని తెదేపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు. తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు పట్టుపడటంతో.. అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ.. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు తెదేపా నేతలు వినతిపత్రం అందజేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించటంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్నారు. తిరుపతిలో రీ పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
ఇవీ చూడండి... : తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల దందా..!