ముఖ్యమంత్రి జగన్ తన మొండితనాన్ని ప్రదర్శించి తిరుమల సంప్రదాయాన్ని కాలరాశారని నెలూర్లు తెదేపా నేత భువనేశ్వర ప్రసాద్ విమర్శించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం అపచారం చేశారని పేర్కొంటూ.. నగరంలోని గాంధీ విగ్రహం వద్ద వెంకటేశ్వర స్వామివారి చిత్రపటంతో నిరసన వ్యక్తం చేశారు. జగన్ చేసిన చేసిన అపచారాన్ని మన్నించాలంటూ స్వామి వారిని వేడుకున్నారు.
సీఎం జగన్... డిక్లరేషన్ ఇవ్వకపోగా, కనీసం హిందూ సంప్రదాయం ప్రకారం తన సతీమణిని కూడా తీసుకురాకపోవడం హైందవ వ్యతిరేకతకు నిదర్శనమని దుయ్యబట్టారు. మూడు రోజులుగా తిరుమల సంప్రదాయాన్ని కాపాడాలని కోరుతుంటే, ఇవేవీ పట్టనట్లు రెచ్చగిట్టేలా మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'తహసీల్దార్లకు జీతాలు చెల్లించని కలెక్టర్లకూ వేతనాలు ఆపాలి'