TDP Leaders Protest Against Illegal Quartz Mining in Nellore District: నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన వెయ్యి టన్నుల క్వార్ట్జ్‌ను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని మాజీమంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (TDP leader Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. తాటిపర్తి పంచాయతీ పరిధిలోని రుస్తుం, భారత్ మైకా గనుల్లో క్వార్ట్జ్ తవ్వకాలను శనివారం ఆయన పరిశీలించారు. గనులకు సమీపంలోనే 50 గిరిజన కుటుంబాలు ఉన్నాయని పేలుళ్ల ధాటికి రాళ్లు ఎగిరి వారి ఇళ్లపై పడుతున్నా అక్రమార్కులు పట్టించుకోవడం లేదన్నారు. భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సొంత గ్రామానికి సమీపంలోనే ఇంత దారుణం జరుగుతున్నా ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి ఆరోపించారు. శనివారం సాయంత్రం మైన్ వద్దకు వెళ్లిన సోమిరెడ్డి అక్కడే బైఠాయించారు.(Somireddy protest against illegal quartz mining) అధికారులు వచ్చి అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని, వాహనాలను సీజ్ చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. రాత్రి అక్కడే బస చేసి అక్రమ మైనింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు.
అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు - 'వైసీపీ నాయకులకు అధికారులు కొమ్ముకాస్తున్నారు'
Achchennaidu on Illegal Quartz Mining: ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్ని వైసీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP state president Achchennaidu) దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి వేల కోట్ల విలువైన క్వార్ట్జ్‌ను అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాకాణి అక్రమ మైనింగ్‌పై 21 రోజుల నుంచి సోమిరెడ్డి పోరాటం చేస్తున్నా పోలీసులు స్పందించకపోవటం వైసీపీ అక్రమాలకు అద్దం పడుతోందని అన్నారు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే అక్రమ మైనింగ్ నిలిపేసి మంత్రి కాకాణిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
వైసీపీ నేతల ఖనిజ దోపిడీకి రాజమార్గం- వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం
MLA Kotam Reddy Supported Somireddy's Protest: అక్రమ మైనింగ్‌పై సోమిరెడ్డి చేస్తున్న పోరాటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) సంఘీభావం తెలిపారు. జిల్లాలో యథేచ్చగా క్వార్ట్జ్ దోపిడీ, ఇసుక, సిలికా రవాణా చేస్తున్నా అధికారులు పట్టంచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు సహజ వనరులను అడ్డంగా దోచేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.