ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెబుతున్న వైకాపా ప్రభుత్వం మైనారిటీలను మభ్యపెడుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. 2010 నాటి ఫార్మేట్ అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసిన పాలకులు, ప్రచారం మాత్రం అందుకు విరుద్ధంగా చేస్తున్నారని నెల్లూరులో దుయ్యబట్టారు.
వైకాపా ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నేతలు ఎన్పీఆర్లో మార్పులు చేయాలని తీర్మానం చేసి, రద్దు చేసినట్లు ప్రచారం చేయడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నగర, రూరల్ ఇన్ఛార్జ్ లు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్‌లు పాల్గొని ఇటీవల చైనా దాడిలో మృతి చెందిన సైనికులకు నివాళులర్పించారు.
ఇవీ చూడండి...