ETV Bharat / state

కొంతమంది అధికారులు వైసీపీ నేతలతో చేతులు కలిపారు: సోమిరెడ్డి

Somireddy Fired on Nellore District YSRCP Leaders: వైసీపీ నేతల అక్రమాలు బయటపడతాయనే ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. తమ పోరాటం ప్రభుత్వ ఉద్యోగులందరిపై కాదని.. అవినీతి, అక్రమాల్లో వైసీపీ నేతలతో చేతులు కలిపిన కొందరిపైనే అని అన్నారు. చంద్రబాబు నెల్లూరు పర్యటన ముగిసిన తర్వాత పోరాటం చేపడతామని తెలిపారు.

Somireddy
సోమిరెడ్డి
author img

By

Published : Apr 3, 2023, 7:03 PM IST

Somireddy Fired on Nellore District YSRCP Leaders: వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు బయటపడతాయనే ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి విమర్శించారు. నెల్లూరులో మీడియాతో టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. మా పోరాటం ప్రభుత్వ ఉద్యోగులందరిపై కాదు.. అవినీతి, అక్రమాల్లో వైఎస్సార్సీపీ నేతలతో చేతులు కలిపిన కొందరిపైనే అని తెలిపారు.

కొంతమంది అధికారులు వైసీపీ నేతలతో చేతులు కలిపారు: సోమిరెడ్డి

నెల్లూరులో సిలికా, నుడా, అక్రమ లేఅవుట్లు, ఇరిగేషన్​లోని కొందరు అధికారులు మాత్రమే.. వైసీపీ నేతలతో చేతులు కలిపారని చెప్పానన్నారు. ఇందులో ఎటువంటి తప్పు లేదని.. వేల కోట్ల ధనం ప్రభుత్వం, ప్రజలు నష్ట పోతున్నారని.. కాబట్టే అలా అన్నానని స్పష్టం చేశారు.

సాక్షాత్తు సాక్షి పత్రికలోనే మీ అక్రమాల గురించి రాశారని తెలిపారు. కీలక శాఖలు కాసులు తీసుకొని మౌనంగా ఉంటున్నారని రాశారని గుర్తు చేశారు. సుమారు 210 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని అన్నారు. ఉద్యోగులపై గౌరవం లేకుండా తాను మాట్లాడలేదని.. కొంత మంది అధికారుల గురించి మాత్రమే చెప్పానన్నారు.

ఉద్యోగులు వివిధ అంశాలపై పోరాటాలు చేసిన సందర్భంలో వారి శిబిరాలకు వెళ్లి మద్దతు పలికాం అని గుర్తు చేశారు. జిల్లాలో లేఅవుట్లు, ఇరిగేషన్ పనులు, సిలికా మైనింగ్​లో జరుగుతున్న దోపీడీపై పోరాటం చేస్తామనగానే మంత్రి కాకాణి ఉలిక్క పడుతున్నారని అన్నారు. నుడా, ఇరిగేషన్, మైనింగ్ శాఖల్లోని కొందరు అధికారుల సహకారంతో వైఎస్సర్సీపీ నేతలు అక్రమాలకు పాల్పడటం ముమ్మూటికీ నిజం అన్నారు.

పెన్నా పరివాహక ప్రాంతంలోని భూములు ఆక్రమణకు గురవుతున్నా ఉన్నతాధికారులు కానుకలు తీసుకుని మౌనం దాల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలికా మైనింగ్​లో వేల కోట్ల దోపిడీ నిజం అని.. ఇరిగేషన్ పనుల్లో వందల కోట్ల అక్రమాలు వాస్తవం అని.. జిల్లాలో అక్రమ లేఅవుట్లు 210 ఉన్నాయనేది బహిరంగ రహస్యం అన్నారు.

అక్రమాలతో నెల్లూరు జిల్లా పరువును పెన్నా నదిలో కలిపేశారని తెలిపారు. ఇంత దారుణంగా దోపిడీలు ఎవరూ చేయలేదని.. మీ బండారం త్వరలోనే బయటపెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 7న చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన ముగిసిన తెల్లారి నుంచే పోరాటం చేపడతాం అని తెలిపారు. అక్రమాలన్నీ ప్రజల ముందు పెడతామని చెప్పారు.

"30 కోట్లు తినేశారని మేము ఒక పాదయాత్ర చేస్తే.. నాలుగు రోజలకు 30 కోట్లు కాదు 40 కోట్లు అని సాక్షిపత్రికలో రాశారు. మేమే ఆశ్చర్యపోయేవి మేము చదువుతున్నాం. మీరు చేసే దోపిడీ ఒకటి కాదు.. ఇసుక, ప్రభుత్వ భూములు, సిలికా ఇలా ఏది ఉంటే అది అడ్డంగా దోచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి నెల్లూరులో ఎప్పుడూ లేదు. మీ బండారం బయటపెడతాం.. 7వ తేదీన బాబు గారి మీటింగ్ అయిపోతే.. తేల్చుకుంటాం. ఇరిగేషన్​లో జరిగిన దోపిడీ, నుడాలో జరిగిన అక్రమాల సంగతి ప్రజల ముందు పెడతాం". - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.