కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తెదేపా పొలిట్ బ్యురో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.15 వేలు చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
కొవిడ్ వల్ల ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్ బీమా అమలు ప్రకటనలకే పరిమితమవుతోంది తప్ప.. పేదలకు దక్కటం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సహాయనిధి పునరుద్ధరణపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు.
ఇదీ చదవండి:
రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు