రాష్ట్రంలో వైకాపా పాలన అప్రజాస్వామికంగా ఉందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విమర్శించారు. శాసన మండలిలో ప్రజాప్రతినిధుల తీరును ప్రజలకు ప్రత్యక్షంగా తెలిపే టీవీ ఛానళ్లకు అభ్యంతరాలు చెప్పడం ఏమిటని నెల్లూరులో ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. మండలిలో నారా లోకేశ్‌పై మంత్రులు దౌర్జన్యానికి దిగితే అడ్డుకోబోయిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్రపైన దాడి చేశారని ఆరోపించారు. దీనికి 100శాతం వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి:వెన్నుపూస విరిగిన వ్యక్తికి ఆర్థిక సాయం