ETV Bharat / state

మాజీ మంత్రి అనిల్​​పై.. నెల్లూరు తేదేపా ఇంఛార్జ్ కోటంరెడ్డి ఫైర్​ - MLA Kotamreddy Sridhar Reddy fell sick

మాజీ మంత్రి అనిల్​ కుమార్​పై తెదేపా నెల్లూరు నగర ఇన్​ఛార్జీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మీలో మీకు పడకపోతే నగర నడిబొడ్డున సభ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు కందమూరు గ్రామ పర్యటనలో ఉన్న నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అస్వస్థతకు గురయ్యారు.

tdp  Nellore City In Charge Kotamreddy Srinivasu Reddy
తెదేపా నెల్లూరు నగర ఇన్​ఛార్జీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
author img

By

Published : Apr 21, 2022, 7:04 PM IST

TDP Kotamreddy Srinivasu Reddy: మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్.. నగరం నడిబొడ్డున సమావేశం నిర్వహించడంపై తెదేపా నగర ఇన్​ఛార్జీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. మీలో మీకు పడకపోతే వ్యక్తిగతం చూసుకోవాలని గానీ ప్రజలు ఇబ్బందికి గురిచేయడం ఏంటని నిలదీశారు. అంతగా కావాలంటే.. మంత్రి కాకానికి పోటీగా సభను కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవాలని గానీ.. నగర నడిరోడ్డుపై నిర్వహించడం ఏంటని మండిపడ్డారు. వైకాపాలో వర్గపోరుకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. మంత్రిగా పనిచేసి, ఎమ్మెల్యేగా ఉంటూ.. ఇంత బాధ్యతరహితంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు హర్షించరని.. రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

MLA Kotamreddy Sridhar Reddy Fell Sick: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా చేపట్టిన 'జగనన్న మాట గడపగడపకు కోటంరెడ్డి బాట' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కందమురు గ్రామ పర్యటనలో ఉన్న ఆయన కుడికాలు కండారాల నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన వెంట ఉన్నవారి సమాచారం మేరకు వైద్యులు కందమురుకు చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు. తీవ్ర ఎండల నేపథ్యంలో అస్వస్థతకు గురయ్యారని.. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

ఇదీ చదవండి: రేపు సున్నావడ్డీ మూడోవిడత పంపిణీ.. ప్రారంభించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.