కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కేసులకు తగినట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదన్నారు. కరోనా వంటి కష్టసమయంలోనూ కక్కుర్తి పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో ఒక్క ల్యాబ్ ఉండటంతోనే ఫలితాలు రావటం ఆలస్యమవుతోందని... మరో రెండు ల్యాబ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు అందించే ఆహార కాంట్రాక్టర్ పనులు మంత్రి బంధువులకే అప్పగించి, నాసిరకమైన భోజనం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి... సమీక్షలతో కాలం వెల్లదీయటం సరికాదని హితువు పలికారు.
ఇదీ చదవండి: 'నా పిల్లులను ఎవరో చంపేశారు.. గుర్తించండి.. శిక్షించండి'