నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద తెదేపా రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య పర్యటించారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి ఆయన సమావేశం నిర్వహించారు. వైకాపా ఏడాది పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని రమణయ్య ఆరోపించారు. గడిచిన రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీల జీవనోపాధికి చెందిన నిధులను నవరత్నాల పేరుతో వారికి దక్కకుండ అన్యాయం చేశారన్నారు. గత ముప్పై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుధాకర్‌ని తెదేపా సానుభూతి పరుడుగా ముద్రవేశారని అన్నారు. కొవిడ్-19 విధుల్లో భాగంగా సరైన వసతులు లేవని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించినందుకు ఉద్యోగం తొలగించడం సరికాదన్నారు. ఆరోగ్యం బాగున్న వ్యక్తిని మానసిక ఆస్పత్రికి తరలించడం దారుణమన్నారు.
'వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి'
వైకాపా ఏడాది పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు తీవ్రతరమయ్యాయని తెదేపా రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య ఆరోపించారు. డాక్డర్ సుధాకర్‌ను తెదేపా సానుభూతి పరుడిగా ముద్రవేయడమే కాకుండా అతని ఉద్యోగం తొలగించడం దారుణమని ఆయన మండిపడ్డారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద తెదేపా రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య పర్యటించారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి ఆయన సమావేశం నిర్వహించారు. వైకాపా ఏడాది పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని రమణయ్య ఆరోపించారు. గడిచిన రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీల జీవనోపాధికి చెందిన నిధులను నవరత్నాల పేరుతో వారికి దక్కకుండ అన్యాయం చేశారన్నారు. గత ముప్పై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుధాకర్‌ని తెదేపా సానుభూతి పరుడుగా ముద్రవేశారని అన్నారు. కొవిడ్-19 విధుల్లో భాగంగా సరైన వసతులు లేవని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించినందుకు ఉద్యోగం తొలగించడం సరికాదన్నారు. ఆరోగ్యం బాగున్న వ్యక్తిని మానసిక ఆస్పత్రికి తరలించడం దారుణమన్నారు.
TAGGED:
డాక్టర్ సుధాకర్ తాజా వార్తలు