నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ బాధ్యతలను అబ్దుల్ అజీజ్‌కు అప్పగించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలతో పాటు కావలి కార్యకలాపాలు సమన్వయం చేసుకోవాలని అబ్దుల్ అజీజ్‌కు సూచించారు. కొత్త ఇన్ఛార్జ్ని నియమించే వరకూ అబ్దుల్ అజీజ్ కావలి నియోజకవర్గానికి బాధ్యత వహిస్తారని తెలిపారు.
ఇది చదవండి : 'బ్రిటిష్ హయాం నాటి రాజద్రోహ చట్టం ఇంకా అవసరమా?'