YCP Suspended MLAs Reaction: సస్పెన్షన్ వల్ల రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నట్లు వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో చాలా సంతోషంగా ఉన్నట్లు మేకపాటి వెల్లడించారు. సస్పెన్షన్ అనేది వైసీపీ ఇష్టం అనీ.. చేసిన విధానం మాత్రం సరికాదంటూ.. వైసీపీ బహిష్కృత నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.
రిలాక్స్‌గా ఉన్నా: వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తన సస్పెండ్‌పై స్పందించారు. వైసీపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. తనను సస్పెండ్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ నిర్ణయంతో చాలా రిలాక్స్‌గా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మంచి చేసిన వారికే.. చెడు చేసే ఆలోచనలు కొందరికి ఉంటాయంటూ విమర్శలు చేశారు. అందులో వైసీపీ అగ్రనేతలు ఈ విషయంలో ముందుంటారని ఆరోపించారు. తాము శక్తి హీనులమైనందునే.. వాళ్లకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని మేకపాటి మండిపడ్డారు.
సీఎం జగన్‌కు మద్దతు ప్రకటించి.. ఇన్నాళ్లు జగన్ వెంటే నడిచినందుకు ఘనంగా సత్కరించారని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిస్తే.. ఇప్పుడు జగనే తన ఎమ్మెల్యే పదవిని తీసేశారని విమర్శించారు. బంగారం లాంటి తన నియోజకవర్గాన్ని వైసీపీ భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. వైసీపీలోని ఎమ్మెల్యేలకు పార్టీలో గౌరవం లేదని.. అతికొద్ది మందికి మాత్రమే అది దక్కుతోందని విమర్శించారు. అందుకోసమే చాలా మంది ఎమ్మెల్యేలు బాధపడుతున్నారని మేకపాటి ఆరోపించారు.
ఈసీ జోక్యం చేసుకోవాలి: కొన్ని నెలలుగా పార్టీకి నేనే దూరంగా ఉన్నానని, సస్పెన్షన్ అనేది వైసీపీ ఇష్టం అనీ.. చేసిన విధానం మాత్రం సరికాదంటూ... వైసీపీ బహిష్కృత నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. సస్పెండ్ చేసిన విధానంపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. తమపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించిన సజ్జల విషయంలో ఈసీ కల్పించుకుని కేసు నమోదు చేయాలని కోటంరెడ్డి వెల్లడించారు. ఏకపక్షంగా, పెత్తందారుల్లా తమని సస్పెండ్ చేశారని కోటంరెడ్డి మండిపడ్డారు. తమకు నోటీసు ఇవ్వకుండా.. తమ వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేశారని ఆరోపించారు. మేకపాటి, శ్రీదేవిపై ఏ ఆధారాతో చర్యలు తీసుకున్నారని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన సభ్యులు ఏం తీసుకుని వైసీపీకి ఓటేశారని ఎద్దేవా చేశారు. ఇకనుంచి మరింత స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెబుతామని కోటంరెడ్డి తెలిపారు.
ఉండవల్లి శ్రీదేవి ఫ్లెక్సీలు చించేసి ఆందోళన: గుంటూరులోని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫ్లెక్సీలు చించేసి ఆందోళన చేశారు. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యే.. అంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు ఫ్లెక్సీలు చింపుతున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.
ఇవీ చదవండి: