నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యపై... తెదేపా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. తిరుపతి ఉపఎన్నికలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో.. వైకాపాకు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని సంజీవయ్య అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. లక్ష ఓట్లు కాదు.. గతంలో వైకాపాకు వచ్చిన 63 వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తే, రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్ చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో ఉన్న తెదేపా ఏజెంట్లను బయటకు లాగి భయానక వాతావరణ సృష్టించారని... ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారంటూ వైకాపా నేతలపై మండిపడ్డారు. ఎన్ని చేసినా తెదేపానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు 5 లక్షల మెజారిటీ తగ్గి.. ఓటమి పాలవటం ఖాయమని.. ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఇదీ చదవండి:
తిరుపతి ఉపఎన్నికపై.. కేంద్ర ఎన్నికల సంఘానికి కలెక్టర్ నివేదిక