నెల్లూరు జిల్లా కోవూరు చక్కెర కర్మాగారం వద్ద కార్మికులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. గత ఏడేళ్లుగా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించలేదని ఆగ్రహించిన కార్మికులు పరిశ్రమ వద్ద అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల రోజులు జీతాలు రాకుంటే ఉద్యోగులు ధర్నాలు చేస్తారు, అలాంటిది ఏడేళ్లుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు.
ఇవీ చూడండి...