నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చెరుకు రైతుల సమస్యలపై భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పొదలకూరులో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతులకు దాదాపు పది కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తెలిపారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బు ఇవ్వకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆర్ఆర్ చట్టం ద్వారా రైతులకు బకాయిలు ఇప్పించేందుకు కలెక్టర్ కృషి చేస్తున్నారని తెలిపారు. చెరకును సాగర్ షుగర్ ఫ్యాక్టరీకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్ఆర్ చట్టాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం, అధికారులు కృషి చెయ్యాలని కోరారు.
ఇదీ చూడండి: 'బకాయిలు చెల్లించి పరిశ్రమను పునఃప్రారంభించండి'