ETV Bharat / state

పూర్తి కాని సంగం బ్యారేజీ..  రాకపోకలకు అంతరాయం - సంగం బ్యారేజి నిర్మాణ పనులు

ఏళ్లు గడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారిపోతున్నాయి. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణ పనులు మిగిలే ఉన్నాయి. పెన్నాకు ఇరువైపులా అనుసంధానం పనులు నిలిచిపోవటంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

sangam barrage construction works
నిలిచిపోయిన సంగం బ్యారేజి నిర్మాణ పనులు
author img

By

Published : Oct 5, 2020, 6:59 PM IST

ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది నాయకులు వచ్చినా నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. బ్యారేజీ నిర్మాణం చేపట్టి 14 ఏళ్లు పూర్తవుతున్నా, ఇంకా పనులు మిగిలే ఉన్నాయి. ప్రధానంగా పెన్నాకు ఇరువైపులా అనుసంధానం జరగకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఆగిన రాకపోకలు..

సంగం ఆనకట్ట వద్ద నీటి మట్టం పది అడుగులు దాటితే వారధిపైన రాకపోకలు సాగించలేరు. సోమశిల జలాశయంలో నీటి నిల్వ ప్రారంభమైన తర్వాత ఈ పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చినా.. అప్పుడప్పుడు వరదలు మళ్లీ పాత రోజులనే గుర్తు చేస్తుంటాయి. గత నెల 17 నుంచి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సగం వంతెనే పూర్తి..

బ్యారేజీకి అనుబంధంగా రెండు వరుసల వంతెన నిర్మాణం పూర్తయితే పరిస్థితి మారుతుందని అందరూ భావించారు. పైభాగంలో వాహనాల రాకపోకలకు 7.5 మీటర్ల వెడల్పున రహదారి, పాదచారుల కోసం ఇరువైపులా 1.5 మీటర్లతో ప్రత్యేక మార్గాలు నిర్మితమవుతున్నా..పనులు 50 శాతం కూడా దాటలేదు. కేవలం 686 మీటర్లు మాత్రమే పూర్తయింది. కుడి(విరువూరు)వైపు 133.5 మీటర్ల మట్టి గట్టు నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఎడమ(సంగం)వైపు అసలు ప్రారంభమే కాలేదు.

వరదతో అంతరాయం..

నవంబరు నెలాఖరుకు పనులు పూర్తి చేసి డిసెంబర్​లో బ్యారేజీని జాతికి అంకితం చేయాలన్నది తెలుగు గంగ ప్రాజెక్టు అధికారుల అంచనా. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కనుపూరు కాలువ, నెల్లూరు చెరువు కాలువల రెగ్యులేటర్ల నిర్మాణం, కనిగిరి జలాశయం, పాపిరెడ్డికాలువలకు అనుబంధంగా నిర్మాణం జరగాల్సి ఉంది. గత నెల నుంచి పెన్నానదిలో వరద కొనసాగతుండటంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

త్వరలో పనులు ప్రారంభం..

"ప్రస్తుతం పెన్నాలో వరద బాగా ఉంది. కొద్ది రోజుల్లో తగ్గుముఖం పడుతుంది. తగ్గిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం"

- హరినారాయణరెడ్డి, తెలుగుగంగ సీఈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.