ముఖ్యమంత్రి జగన్ తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. నెల్లూరులో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన... వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు 25 మంది ఎంపీలనిస్తే... కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు ఎవరి మెడలు వంచుతున్నారని ప్రశ్నించారు. పౌరసత్వ బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చి... రాష్ట్రంలో మైనార్టీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
అన్ని పార్టీలు భాజపాకు మద్దతు
రాష్ట్రంలోని అన్ని పార్టీలు భాజపాకు మద్దతిస్తున్నాయని శైలజానాథ్ విమర్శించారు. కియాపై వస్తున్న వందతులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: