కరోనా వైరస్ నుంచి తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు మస్తాన్ వలి దర్గాలో తెదేపా నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మస్తాన్ స్వామి వారి సమాధిపై గల్ఫ్ చాదర్, పూల దుప్పటి కప్పారు. ఆ తర్వాత 100 టెంకాయలు కొట్టారు. అనంతరం దర్గా పూజారులు, మత పెద్దలు కరోనా నుంచి సోమిరెడ్డి త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
భారత దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంతోపాటు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధి ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో సోమిరెడ్డి పేరిట ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెంకటాచలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ తెలిపారు.
ఇదీ చదవండి: భగవద్గీత స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు..