ఏపీ హైకోర్టును అమరావతిలో అని నిర్ణయించినప్పుడే సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రపతి కూడా ఆమోదించారని సోమిరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టును మార్చలేవని చట్టాలు చెబుతుంటే... హైకోర్టు తరలింపుతో కలిసిన మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ సంతకం పెట్టేశారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే దుందుడుకు నిర్ణయాలను రాజ్ భవన్ వ్యవస్థ ఆషామాషీగా తీసుకోకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ఉత్తర్వులివ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టేటస్ కో