మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతోనే నవరత్నాలు అమలు చేయాలని వైకాపా ప్రభుత్వం యోచిస్తున్నట్లు కనిపిస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టాక కొంత పెరుగుదల ఉంటే, మరికొంత తగ్గుదల కూడా కనిపిస్తోందని ఆయన నెల్లూరులో విమర్శించారు. భౌతిక దాడులు, కరెంటు కోతలు, ఇసుక, మద్యం ధరలు పెరిగితే, వృద్ధి రేటు, పెట్టుబడులు తగ్గాయని అన్నారు. నెల్లూరులో రెండు రోజుల చంద్రబాబు పర్యటన విజయవంతమైందని చెప్పారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో దాడుల సంస్కృతిని తీసుకు వస్తున్న వైకాపా తీరు పట్ల చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా కొందరు పోలీసులు ప్రవర్తిస్తున్నారని, వారి తీరు మార్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ జిల్లాలో వైకాపా దాడులను కట్టడి చేయాలని కోరారు.
ఇవీ చదవండి