ETV Bharat / state

‘కరోనానూ క్యాష్ చేసుకునే వారున్నారు’ - somireddy about jagan

వైకాపా ప్రభుత్వం పేదలకు కానుకగా కరెంట్ బిల్లులు పెంచిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ… నెల్లూరులో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

somireddy chandramohan reddy fires on jagan over power bills hike
మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
author img

By

Published : May 24, 2020, 7:55 PM IST

సగటున ప్రతి ఇంటిపై 1500 రూపాయల అదనపు విద్యుత్ బిల్లుల భారం మోపారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో పెరిగిన విద్యుత్ ఛార్జీలతో దాదాపు 120 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు 3 నెలల కరెంటు బిల్లులు మాఫీ చేయాలని, ఫిబ్రవరి బిల్లునే ఈ 3 నెలలకు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

పేదలకు కానుకలని చెప్పే ముఖ్యమంత్రి... కరెంట్ బిల్లులు, నిత్యావసర సరకుల ధరలు, మద్యం ధరలు పెంచడమేనా కానుక.. అని ప్రశ్నించారు. కరోనాను కూడా క్యాష్ చేసుకునే వారు రాష్ట్రంలో తయారయ్యారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొనిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.