వరదలను ఎదుర్కోవటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy on floods) విమర్శించారు. రాష్ట్రంలో అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వర్షాలపై ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్న సోమిరెడ్డి.. మానవ తప్పిదం వల్లే ప్రకృతి విలయం సృష్టించిందన్నారు. వర్షాలు పడతాయన్న హెచ్చరికలు ఉన్నప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.
జలాశయాల నిర్వహణ గాలికొదిలేశారని.. గతేడాది వరదలకు దెబ్బతిన్న సోమశిల జలాశయం అఫ్రాన్కు మరమ్మతులు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమశిలకు ఎలాంటి ప్రమాదమూ జరగకుండా ప్రభుత్వం వెంటనే పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బాధితులకు అందిస్తున్న పరిహారాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి